Dil Raju: బెనిఫిట్ షోలు అనేది చాలా చిన్న అంశం..! 10 d ago
తెలుగు సినీ ఇండస్ట్రీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని సీఎం సూచించారని నిర్మాత దిల్ రాజు తెలిపారు. మన సినీ ఇండస్ట్రీని ప్రపంచంలోనే నంబర్ వన్ గా చేయడం కోసం ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని చెప్పారు. హాలీవుడ్ వాళ్ళు వచ్చి మన హైదరాబాద్ లో షూటింగ్ చేసేలా సూచనలు ఇవ్వాలని సీఎం అడిగారు, ప్రభుత్వంతో కలిసి మన హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ సినీ ఇండస్ట్రీ హబ్ గా మారుస్తామని దిల్ రాజు అన్నారు. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు అనేది చాలా చిన్న అంశం అని FDC చైర్మన్ దిల్ రాజు పేర్కొన్నారు.